Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శనివారం నాడు చంద్రబాబుతో సమావేశమవుతోన్న శివరామకృష్ణన్ కమిటీ

శనివారం ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో శివరామకృష్ణన్ కమిటీ సమావేశమవుతోంది. రాజధాని ఏర్పాటు అంశానికి సంబంధించి ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన మూడు నెలల్లో రాజధాని కోసం స్థలాన్ని గుర్తిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. రాజధానికి 30 వేల ఎకరాలు అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. రేపు ఉదయం 9 గంటలకు రాష్ట్ర సచివాలయంలో రాజధాని సలహా కమిటీ సమావేశమవుతుందని ఆయన తెలిపారు.

More Telugu News